logo

బాహుదాను తోడేస్తున్నారు

కలకడ మండలం గంగాపురం పంచాయతీ పరిధిలోని బాహుదా నదిలో ఇసుక తవ్వకాలను కలికిరి మండలం మహల్‌, అద్దవారిపల్లె గ్రామాల రైతులు, గ్రామస్థులు శుక్రవారం అడ్డుకున్నారు.

Published : 01 Apr 2023 02:39 IST

ఇసుక తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్థులు

ఇసుక తవ్వరాదని బైైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు, గ్రామస్థులు

కలకడ, న్యూస్‌టుడే : కలకడ మండలం గంగాపురం పంచాయతీ పరిధిలోని బాహుదా నదిలో ఇసుక తవ్వకాలను కలికిరి మండలం మహల్‌, అద్దవారిపల్లె గ్రామాల రైతులు, గ్రామస్థులు శుక్రవారం అడ్డుకున్నారు. ఇసుక రీచ్‌ పేరుతో నదిలోని ఇసుకను పూర్తిగా తరలించేస్తున్నారని, ఇప్పటికే అద్దవారిపల్లె ప్రాంతంలో పూర్తిగా తరలించడంతో నదిలో రాళ్లు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఇసుక తోడేయడంతో పొలాలకు వెళ్లే దారులు మూసుకుపోగా తాగు, సాగునీటి బోరుబావులు, వ్యవసాయ బావులు ఎండిపోయి పొలాలు బీడుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ఇసుకను తోడనియ్యమని పొక్లైన్‌ అడ్డుకుని అక్కడే బైౖఠాయించారు. విషయం తెలుసుకున్న కలకడ, కలికిరి ఎస్సైలు తిప్పేస్వామి, లోకేష్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇసుక రీచ్‌ను అడ్డుకోరాదని ప్రజలకు సూచించారు. ఇసుకను తోడేస్తే మంచినీటి సమస్యలు తలెత్తుతాయని గ్రామస్థులు పేర్కొన్నారు. సోమవారం వరకు ఇసుక తరలింపు నిలుపుదల చేస్తామని ఎస్సైలు హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని