logo

ఒక్క క్లిక్‌తో ఆర్‌అండ్‌డీ సమాచారం

యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో పరిశోధకులకు విలువైన సమగ్ర సమాచారం అందుబాటులోకి తీసుకొస్తూ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జింక రంగజనార్దన, కులసచివులు వెంకటసుబ్బయ్య, ప్రధానాచార్యులు కె.కృష్ణారెడ్డితో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు.

Published : 01 Apr 2023 02:39 IST

ప్రారంభించిన ఉపకులపతి రంగజనార్దన

వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న వైవీయూ అధికారులు, అధ్యాపకులు

వైవీయూ (కడప), న్యూస్‌టుడే : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో పరిశోధకులకు విలువైన సమగ్ర సమాచారం అందుబాటులోకి తీసుకొస్తూ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జింక రంగజనార్దన, కులసచివులు వెంకటసుబ్బయ్య, ప్రధానాచార్యులు కె.కృష్ణారెడ్డితో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. వైవీయూ ఐటీ హబ్‌ సంచాలకులు ఆచార్య ఎం.వి.శంకర్‌ ఆధ్వర్యంలో నూతనంగా వైవీయూ వెబ్‌సైట్లో పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన సమాచారం, జాతీయ సేవా పథకం విభాగాలను పొందుపరిచారు. ఉపకులపతి మాట్లాడుతూ ఆర్‌అడ్‌డీకి సంబంధించి ప్రాజెక్టు ప్రపోజల్‌, డీఎస్టీ, సీఎస్‌ఐఆర్‌ అడ్వర్‌జైంట్‌మెంట్స్‌, ప్రాజెక్టులు, స్కాలర్లకు ఉన్న పరిశోధన అవకాశాలు వెబ్‌సైట్‌లో లభిస్తాయన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌కు సంబంధించి విశ్వవిద్యాలయ పరిధిలోని 121 యూనిట్ల జాబితా, పీవోలు, ప్రత్యేక శిబిరాల సమాచారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైవీయూ పాలకమండలి సభ్యురాలు పుత్తాపద్మ, ఆర్‌అండ్‌డీ డైరెక్టర్‌ చంద్రఓబుల్‌రెడ్డి, ఎన్‌ఎస్‌స్‌ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని