logo

రాయలసీమ గళాన్ని వినిపించిన దేవిరెడ్డి శ్రీనాథ్‌

రాయలసీమ వెనుకబాటుతనాన్ని.. తాగు సాగు నీటి రంగాల్లో సీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడంతో రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ మాజీ ఛైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి ముండేవారని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ పేర్కొన్నారు.

Published : 01 Apr 2023 02:39 IST

శ్రీనాథ్‌రెడ్డి సంస్మరణ సభలో మాట్లాడుతున్న దేవులపల్లి అమర్‌

కడప నగరపాలక, న్యూస్‌టుడే: రాయలసీమ వెనుకబాటుతనాన్ని.. తాగు సాగు నీటి రంగాల్లో సీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడంతో రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ మాజీ ఛైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి ముండేవారని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ పేర్కొన్నారు. గత నెల శ్రీనాథ్‌ మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం నగరంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. సీనియర్‌ పాత్రికేయుడు నాగిరెడ్డి సభకు అధ్యక్షత వహించగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి వందన సమర్పణ చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన దేవులపల్లి అమర్‌, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి మాట్లాడుతూ.. పాత్రికేయుల్లో ఎవరికి అన్యాయం జరిగినా వారి కోసం పోరాడి నిజమైన నాయకుడిగా ప్రస్థానం కొనసాగించారన్నారు. సీనియర్‌ రాజకీయ నాయకులు తులసిరెడ్డి, ట్రేడ్‌యూనియన్ల నాయకుడు సీహెచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, సీపీఐ నాయకులు చంద్ర, సీపీ బ్రౌన్‌ లైబ్రరీ కార్యదర్శి జానుమద్ధి విజయభాస్కర్‌ పాల్గొన్నారు.

నరసింహులు కుటుంబానికి ఆర్థిక సాయం : ఒంటిమిట్టకు చెందిన సీనియర్‌ పాత్రికేయుడు నరసింహులు ఇటీవల మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరికి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని దేవులపల్లి అమర్‌ ద్వారా సీఎం జగన్‌ దృష్టికి ఇటీవల తీసుకెళ్లారు. ఆయన స్పందించి బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. ఆ చెక్కును నరసింహులు కుటుంబసభ్యులకు శుక్రవారం అందించారు. బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త ‘మనం’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని