logo

వైకాపా పాలన నచ్చకనే తెదేపాలో చేరికలు : పుత్తా

వైకాపా నియంతృత్వ పాలన నచ్చకనే తెదేపాలో చేరుతున్నారని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు.

Published : 01 Apr 2023 02:39 IST

పార్టీలో చేరిన వారితో పుత్తా నరసింహారెడ్డి

కమలాపురం, న్యూస్‌టుడే: వైకాపా నియంతృత్వ పాలన నచ్చకనే తెదేపాలో చేరుతున్నారని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు. జంభాపురం పంచాయతీలోని గొల్లపల్లె, సల్తిమ్మాయపల్లె గ్రామాల్లోని వైకాపాకు చెందిన వంద కుటుంబాలు శుక్రవారం పుత్తా సమక్షంలో పార్టీలో చేరాయి. వారికి పుత్తా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా విధానాలు, పద్ధతులు నచ్చకనే తెదేపాలో చేరుతున్నామని గంగిరెడ్డి, గంగాధర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, నాగేంద్రారెడ్డి, శివారెడ్డి, హనుమంత్‌రెడ్డి, కిట్టయ్య, శివశంకర్‌ తదితరులు పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు సుధా అంకిరెడ్డి, మండల కన్వీనర్‌ రాఘవరెడ్డి, ఉప కన్వీనర్‌ గుజ్జుల నారాయణ, మెరిన్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని