logo

మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి : ఎంపీ

వైకాపా ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలోని వీజే ఫంక్షన్‌ హాలులో శుక్రవారం వైఎస్సార్‌ ఆసరా మూడో విడద నగదు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

Published : 01 Apr 2023 02:39 IST

మహిళా సంఘాలకు చెక్కును అందజేస్తున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, చిత్రంలో వైకాపా నాయకులు, అధికారులు

పులివెందుల, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలోని వీజే ఫంక్షన్‌ హాలులో శుక్రవారం వైఎస్సార్‌ ఆసరా మూడో విడద నగదు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలల్లో 95 శాతం పథకాలు మహిళల అభ్యున్నతి కోసమేననన్నారు. పులివెందులలో అధునాతన ఆర్టీసీ బస్టాండ్‌ను నిర్మించామని.. ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. ముద్దనూరు నుంచి పులివెందుల, పులివెందుల నుంచి ముదిగుబ్బ, పుట్టపర్తి, బెంగుళూరు వరకు రైలుమార్గం కనెక్టివిటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని వివరించారు. వైఎస్సార్‌ ఆసరా కింద మూడో విడత పులివెందుల నియోజకవర్గంలోని 4,573 సంఘాలకు రూ.41.57 కోట్ల రుణమాఫీ కాగా ఆ మేరకు మహిళా సంఘాలకు ఎంపీ చెక్కు పంపిణీ చేశారు. అనంతరం 104 వాహనాన్ని ప్రారంభించారు. వైఎస్సార్‌ జలకళ పథకం కింద బోరు వేసిన సింహాద్రిపురం, వేముల మండలాలకు చెందిన 24 మందికి రూ.1.7 కోట్ల విలువ గల మోటారు పంపుసెట్లు  పంపిణీ చేశారు. పురపాలక ఛైర్మన్‌ వరప్రసాద్‌, పురపాలక వైస్‌ ఛైర్మన్‌ వైఎస్‌ మనోహరరెడ్డి, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, మార్కెట్యార్డు ఛైర్మన్‌ చిన్నప్ప, పురపాలక వైస్‌ ఛైర్మన్‌ హబీజ్‌, డీఆర్‌డీఏ పీడీ ఆనందనాయక్‌, ద్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, ఏపీడీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని