logo

చార్‌ధామ్‌ యాత్రలో పులివెందుల వాసుల ఇక్కట్లు.. మోసగించిన ట్రావెల్స్ నిర్వాహకులు

హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రావెల్స్‌ నిర్వాహకులు ఒప్పందం మేరకు వసతులు కల్పించకుండా తమను మోసగించారని చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన పులివెందులకు చెందిన యాత్రికులు ఆరోపించారు.

Updated : 21 May 2023 10:26 IST

పాట ప్రాంతంలో పులివెందుల వాసులు

పులివెందుల, న్యూస్‌టుడే: హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రావెల్స్‌ నిర్వాహకులు ఒప్పందం మేరకు వసతులు కల్పించకుండా తమను మోసగించారని చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన పులివెందులకు చెందిన యాత్రికులు ఆరోపించారు. తాము ఉత్తరాఖండ్‌లోని పాట ప్రాంతంలో ఆగిపోయామంటూ సుమారు 15 మంది యాత్రికులు చరవాణిలో స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తాము హైదరాబాద్‌ నుంచి ఓ ట్రావెల్స్‌ బస్సులో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లామని తెలిపారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల చొప్పున వసూలు చేశారని వివరించారు. పాట ప్రాంతం నుంచి తమను హెలీకాప్టర్‌లో తీసుకెళ్లాల్సి ఉండగా, అది తప్పిపోయిందని మభ్యపెడుతూ బస్సులో నుంచి దించేశారని వాపోయారు. తమకు భోజనం, బస వసతులు కల్పించలేదని, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని, ఏపీ ప్రభుత్వం దృష్టిసారించి ఆదుకోవాలని వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని