logo

మిస్సింగ్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ విధానంతో ఉత్తమ ఫలితాలు

జిల్లాలో మిస్సింగ్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ విధానంతో మంచి ఫలితాలొస్తున్నాయని ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు. వివిధ రకాల కారణాలతో పోగొట్టుకున్న రూ.45 లక్షల విలువ జేసే 189 చరవాణులు రికవరీ చేశారు.

Published : 26 May 2023 02:15 IST

పోగొట్టుకున్న 189 చరవాణుల రికవరీ చేసి బాధితులకు అందించిన ఎస్పీ అన్బురాజన్‌

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలో మిస్సింగ్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ విధానంతో మంచి ఫలితాలొస్తున్నాయని ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు. వివిధ రకాల కారణాలతో పోగొట్టుకున్న రూ.45 లక్షల విలువ జేసే 189 చరవాణులు రికవరీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో రికవరీ చేసిన చరవాణులను ఎస్పీ తన చేతుల మీదుగా బాధితులకు గురువారం అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అతి తక్కువ కాలంలో పోగొట్టుకున్న చరవాణులు రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. ఠాణాలకు వెళ్లకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకుండానే పోగొట్టుకున్న చరవాణులను బాధితులకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 5000 ఫిర్యాదు రాగా వాటిలో 1500 ఫోన్లు పని చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మిగిలిన చరవాణులను కూడా త్వరలో స్వాధీనపరచుకుంటామని చెప్పారు. సరైన బిల్లులు లేకుండా ఎవరూ చరవాణులు కొనవద్దని ఎస్పీ సూచించారు. ఎవరైనా చరవాణులు పోగొట్టుకున్నట్లయితే 93929 41541 నంబర్‌ పోయిన చరవాణి వివరాలన్నింటిని వాట్సాప్‌ పెడితే చరవాణిని గుర్తిస్తామని చెప్పారు. ఇవన్నీ ఉచిత సేవలేనని తెలిపారు. ఈ విధానాన్ని 2022 డిసెంబరు 1న ప్రారంభించామని గడిచిన అయిదు నెలల కాలంలో రూ.1.75 కోట్ల విలువ చేసే 669 చరవాణులు స్వాధీన పరుచుకున్నాం. చరవాణులు పొందిన బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏఎస్పీ తుషార్‌ డూడి, కడప డీఎస్పీ షరీఫ్‌, సీఐ శ్రీధర్‌నాయుడు తదితరులున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు