logo

భూసర్వేను అడ్డుకున్న రైతులు

విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి భూసేకరణలో అధికారులకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. శనివారం పిచ్చపాడు రెవెన్యూ పరిధిలోని ద్వారకానగరం

Published : 28 May 2023 04:22 IST

తహసీల్దారు సుభానితో చర్చిస్తున్న రైతులు

చాపాడు, న్యూస్‌టుడే : విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి భూసేకరణలో అధికారులకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. శనివారం పిచ్చపాడు రెవెన్యూ పరిధిలోని ద్వారకానగరం వద్ద కొలతలు వేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కొలతలు వేయాలని చూసినా, గ్రామస్థులు అంగీకరించలేదు. రూ.కోట్లలో విలువ చేసే భూములను ఎకరా రూ.లక్షల్లో తీసుకోవడం న్యాయం కాదని రైతులు ఆరోపించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూముల్లో కొలతలు సేకరించడం దారుణమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేసే వరకు సహకరించమన్నారు. అనంతరం రైతులతో తహసీల్దారు సుభాని చర్చలు జరిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని