logo

ఉద్యోగుల ఉద్యమబాట

సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి డిమాండు చేశారు.

Published : 28 May 2023 04:22 IST

సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌నుపునరుద్ధరించాలని డిమాండు

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్ష చేస్తున్న  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు, సభ్యులు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి డిమాండు చేశారు. మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శనివారం ఏపీజీఈఏ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రతి నెలా 1వ తేదీనే జీతభత్యాలు చెల్లించేవిధంగా చట్టం చేయాలని, 1993, నవంబరు 25కు ముందు నియమితులైన ఎన్‌ఎంఆర్‌, డైలీవేజెస్‌, కంటింజెంట్‌ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్‌ చేయాలని, అన్నిశాఖల్లో డీఎస్సీ ద్వారా నియమితులైన ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, పొరుగు సేవల ఉద్యోగులను మెరుగైన జీతాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర అంశాలను డిమాండు చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గురుప్రసాద్‌, డివిజన్‌ అధ్యక్షుడు నాగేంద్రబాబు, కార్యదర్శి శివరాంప్రసాద్‌, కోశాధికారిణి కల్యాణి, ఉపాధ్యక్షులు బీవీ రమణ, కిరణ్‌కుమార్‌, శేషయ్య, సాయి, ఏపీయూఎస్‌ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బీవీ రమణ, కార్యదర్శి కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని