logo

నిలిచిన రిజిస్ట్రేషన్లు!

రాజంపేట డివిజన్‌ పరిధిలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వ్యవసాయ భూములను చదును చేసి ప్లాట్లుగా వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. 

Published : 28 May 2023 04:22 IST

రాజంపేటలో వెలుగుచూస్తున్న అక్రమ లేఅవుట్లు

లేఅవుట్‌లో వేసిన ప్లాట్లు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట డివిజన్‌ పరిధిలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వ్యవసాయ భూములను చదును చేసి ప్లాట్లుగా వేసి అమ్మకాలు సాగిస్తున్నారు.  చివరకు వీటిని కొనుగోలు చేసినవారు ఇబ్బందులకు గురవుతున్నారు. రాజంపేట మండలంలో దాదాపు వంద వరకు లేవుట్లు ఉన్నాయి. కాలువలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు... ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్లాట్లు వేశారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను వ్యవసాయేతరం కింద మార్చుకోవడానికి పన్ను చెల్లించాలి. తర్వాత స్థలాలుగా మార్చాలి. ఎక్కడా ఆ నిబంధనలు పాటించడం లేదు. అధికారులూ పట్టించుకోకపోవడంతో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వ్యవహారం ఇటీవల వరకు రాజంపేట సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆయా భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు.  రాజంపేట, చిట్వేలి, పుల్లంపేట, సుండుపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రసుత్తం ఇళ్లు, వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. గతంలో ప్లాట్లు రిజిస్టర్‌ అయినా అవి వ్యవసాయేతర భూములు కాకపోతే, అటువంటి వాటిని ప్రస్తుతం పక్కన పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు