ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
ఉమ్మడి కడప జిల్లాలోని ఎరువుల దుకాణాలపై బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు ఏఎస్పీ మాసుంబాషా, వ్యవసాయశాఖాధికారులు సంయుక్తంగా దాడులు చేశారు.
కడప, నేరవార్తలు, రాయచోటి, న్యూస్‌టుడే: ఉమ్మడి కడప జిల్లాలోని ఎరువుల దుకాణాలపై బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు ఏఎస్పీ మాసుంబాషా, వ్యవసాయశాఖాధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ప్రొద్దుటూరు, రాయచోటి పట్టణాల్లో విత్తనాలు విక్రయిస్తున్న నాలుగు దుకాణాలపై దాడులు చేసి నిల్వల దస్త్రాలు, రశీదు పుస్తకాలతోపాటు సరకు నిల్వలను తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా వైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని భారత్ విత్తన ఏజెన్సీ, తిరుమల విత్తన దుకాణాలకు సంబంధించి సరైన పత్రాల్లేకపోవడంతో రూ.1,56,800 విలువ చేసే విత్తనాల అమ్మకాన్ని నిలుపుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర విత్తన ఏజెన్సీ, తులసీ ఏజెన్సీల్లో పత్రాలు లేకపోవడంతో రూ.1,27,950 విలువ చేసే విత్తనాల అమ్మకాన్ని నిలిపేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని రఘు అగ్రికేర్‌లో విత్తన చట్ట ప్రకారం స్టాక్ పుస్తకం సరిగా లేకపోవడంతో రూ.1,41,900 విలువైన విత్తనాల అమ్మకాన్ని నిలిపేశారు. ఈ సందర్భంగా మాసుంబాషా మాట్లాడుతూ.. ఎవరైనా దుకాణాదారులు నకిలీ విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారమివ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. దాడుల్లో విజిలెన్స్, వ్యవసాయాధికారులు ఈదురు బాషా, రామకృష్ణ, శ్రీనివాసులు, బాలగంగాధర్‌రెడ్డి, కిశోర్, అశోక్‌కుమార్ శివశంకర్‌రెడ్డి, దివాకర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Manipur: మణిపుర్లో మరోసారి ఉద్రిక్తతలు.. కర్ఫ్యూ సడలింపులు రద్దు!
-
JDS: భాజపా నేతలతో దేవెగౌడ కీలక భేటీ.. ఎన్డీయేలో జేడీఎస్ చేరికకు రంగం సిద్ధం?
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Rupert Murdoch: ‘ఫాక్స్’ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన రూపర్ట్ మర్దోక్