రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలంలోని పగిడాల వైజంక్షన్ వద్ద బుధవారం చోటు చేసుకుంది.
రాజుపాళెం,న్యూస్‌టుడే : ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలంలోని పగిడాల వైజంక్షన్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. వెల్లాల గ్రామానికి చెందిన ఇండ్ల ఓబులేసు (36), దండు సుదర్శన్(36) ద్విచక్రవాహనంపై వెంగాళాయపల్లె నుంచి వెల్లాల వెళుతుండగా పగిడాల వైజంక్షన్ వద్ద ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీరిద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Hyderabad: చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనలో స్థానికులు
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి