పాడి రైతులు నష్టపోకుండా చర్యలు
పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు.
జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో పాడిరైతులు, పాలసేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గంలోని 25 గ్రామాల్లోని పాడిరైతుల నుంచి క్రమం తప్పకుండా పాల సేకరణ చేపట్టాలన్నారు. జిల్లా సహకార బ్యాంకుల నుంచి స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల నుంచి పశువుల కొనుగోలు, యూనిట్‌ల ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలన్నారు. సమీక్షలో సహకార అధికారి సుభాషిణి, జేడీ డాక్టర్ శారద, ఏపీడీడీసీఎఫ్ బాధ్యులు వెంకటేశ్వరమ్మ, పీడీ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.* వైద్య ఆరోగ్యశాఖ, దాని అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పోషకాహార లోపంతో పిల్లలు, రక్తహీనతతో మహిళలు ఉండరాని, వైద్యులు క్రమం తప్పకుండా విధుల్లో పాల్గొనాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టరు మౌర్య భరద్వాజ్, డీఎంహెచ్‌వో డాక్టర్ ఖాదర్‌వలీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Manipur: మణిపుర్లో మరోసారి ఉద్రిక్తతలు.. కర్ఫ్యూ సడలింపులు రద్దు!
-
JDS: భాజపా నేతలతో దేవెగౌడ కీలక భేటీ.. ఎన్డీయేలో జేడీఎస్ చేరికకు రంగం సిద్ధం?