కేతు విశ్వనాథరెడ్డి సేవలు మరువలేనివి
సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర సలహామండలి సభ్యుడిగా బ్రౌన్ గ్రంథాలయానికి ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి చేసిన సేవలు మరువలేనివని.
కడప ఎన్‌జీవో కాలనీ, న్యూస్‌టుడే: సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర సలహామండలి సభ్యుడిగా బ్రౌన్ గ్రంథాలయానికి ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి చేసిన సేవలు మరువలేనివని.. ఆయన మృతి సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి తీరనిలోటని వైవీయూ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ పేర్కొన్నారు. నగరంలోని సీపీ బ్రౌన్ కేంద్రంలో బుధవారం ప్రసిద్ధ కథా రచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ... కేతు కథకునిగా, విద్యావేత్తగా, పరిశోధకునిగా నిరంతర సృజనశీలిగా సుప్రసిద్ధులన్నారు. ఆయన జిల్లా వాసి కావడం మనందరి అదృష్టమన్నారు. ఆయన చేసిన పరిశోధనలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకమైన అనేక నిఘంటువుల రూపకల్పనకు దారితీసిందన్నారు. రిజిస్ట్రార్ వైపీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ... తాను పుట్టిన నేల, పెరిగిన సమాజం రెండింటిని ప్రధాన వస్తువుగా చేసుకుని అద్భుతమైన కథలు రాశారని.. జిల్లాలో ఉన్న సామాన్యుల జీవితాల్లో సంభవించే అన్ని కోణాలను తనదైన మార్క్సిస్టు దృక్పథంతో ఆవిష్కరించారన్నారు. అనంతరం కేతు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బ్రౌన్ సంచాలకులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి, సహాయ పరిశోధకులు భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, చింతకుంట శివారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి