logo

అక్రమ తవ్వకాలు... ఆపై ఆక్రమణలు

బద్వేలు పట్టణంలోని శివారు గుట్టలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు గుట్టల మధ్య ఆహ్లాదకరంగా కనిపించిన పట్టణం ప్రస్తుతం బోసిపోతోంది.

Published : 02 Jun 2023 05:11 IST

చిత్రంలో కనిపిస్తోంది బద్వేలు పురపాలక సంఘం పరిధిలోని సాయిబాబా ఆలయం వద్ద ఇటీవల అక్రమ తవ్వకాలతో రూపుకోల్పోయిన గుట్ట. ఇక్కడి స్థలాలకు డిమాండు పెరగడంతో కబ్జాదారులు గుట్టపై తవ్వకాలు జరుపుతూ చుట్టుపక్కన స్థలాలను ఆక్రమిస్తున్నారు.


చిత్రంలో కనిపిస్తోంది బద్వేలు పట్టణ శివారు ప్రాంతంలో అనధికారికంగా వెలిసిన షెడ్లు. ఇక్కడ సెంటు స్థలం ధర రూ.లక్షల్లో పలుకుతుండటంతో గుట్ట సమీపంలోని స్థలాలు కజ్జా చేసి షెడ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థలాలన్నీ ఆక్రమణలకు గురయ్యాయి.


బద్వేలు, న్యూస్‌టుడే : బద్వేలు పట్టణంలోని శివారు గుట్టలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు గుట్టల మధ్య ఆహ్లాదకరంగా కనిపించిన పట్టణం ప్రస్తుతం బోసిపోతోంది. కబ్జాదారులు గృహనిర్మాణ అవసరాలకు మట్టి, రాళ్లను తవ్వి రవాణా చేస్తూ రూ.లక్షలు వెనకేసుకుంటూ ఆక్రమణలకు సైతం పాల్పడుతున్నారు. చెన్నంపల్లెలోని సాయిబాబా ఆలయం వద్ద ఉన్న కొండగుట్టపై జరుగుతున్న అక్రమ తవ్వకాలపై ఇటీవల స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో వెంకటరమణ ఆదేశాల మేరకు తహసీల్దారు మధుసూదనరెడ్డి తన సిబ్బందితో కలిసి కొండగుట్ట వద్దకు వెళ్లి రెండు ట్రాక్టర్లు, ఓ జేసీబీ యంత్రాన్ని సీజ్‌ చేశారు. రెవెన్యూ అధికారుల అనుమతి లేనిదే మట్టి, రాళ్లు తవ్వకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై తహసీల్దారు మధుసూదనరెడ్డి మాట్లాడుతూ కొండగుట్లపై ఎలాంటి అక్రమ తవ్వకాలు జరపొద్దని ఆదేశించామని, ఆక్రమణలకు పాల్పడేవారిని ఉపేక్షించమని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని