logo

బుగ్గవంకపై వంతెనలు నిర్మించాలని ఆందోళన

కడప నగరంలోని బుగ్గవంకపై వంతెనల నిర్మాణం చేపట్టాలని సాధన కమిటీ, అఖిలపక్షం నాయకులు డిమాండు చేశారు. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా క్యాంపు కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేపట్టారు.  

Published : 02 Jun 2023 05:11 IST

ఉపముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అఖిలపక్ష నాయకులు

చిన్నచౌకు(కడప), మారుతీనగర్‌, న్యూస్‌టుడే: కడప నగరంలోని బుగ్గవంకపై వంతెనల నిర్మాణం చేపట్టాలని సాధన కమిటీ, అఖిలపక్షం నాయకులు డిమాండు చేశారు. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా క్యాంపు కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేపట్టారు.  సాధన కమిటీ కన్వీనర్‌ హమీద్‌ మాట్లాడుతూ బుగ్గవంక ఆధునికీకరణ పేరిట 200 ఏళ్ల నాటి కాజ్‌వేలను తొలగించడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అఖిలపక్షం నాయకులు హరిప్రసాద్‌, చంద్ర, రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గుర్రాలగడ్డ, రవీంద్రనగర్‌ వద్ద కాజ్‌వేలు లేకపోవడంతో పాతబస్టాండు, కాగితాలపెంట వంతెనలపై నుంచి వెళ్లాల్సి వస్తోందన్నారు. ఉపముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో కార్యాలయానికి వినతిపత్రం అతికించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు అహ్మద్‌బాబు, ఓబులేసు, సుబ్బరాయుడు, మద్దిలేటి, శ్రీకృష్ణదేవర, మగ్బుల్‌, మైనుద్దీన్‌, బాబుభాయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని