శీతల పవనాల సౌరభం
వేసవి వచ్చిందంటే చాలు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ధనికులు ఏసీలు, మధ్య తరగతి కుటుంబాలు కూలర్లు కొనుగోలు చేసుకుని ఉపశమనం పొందుతుండగా పేదలు పంకాలతోనే నెట్టుకొస్తున్నారు.
సోలార్ ఆపరేటెడ్ కూలర్
ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభ
తాము తయారు చేసిన సోలార్ ఆపరేటెడ్ పర్యావరణ హిత కూలర్‌తో ఇంజినీరింగ్ విద్యార్థులు
మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : వేసవి వచ్చిందంటే చాలు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ధనికులు ఏసీలు, మధ్య తరగతి కుటుంబాలు కూలర్లు కొనుగోలు చేసుకుని ఉపశమనం పొందుతుండగా పేదలు పంకాలతోనే నెట్టుకొస్తున్నారు. కొందరికీ అవీ లేక విసనకర్రలే గతి. ఏసీలు కొనుగోలు చేయాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డబ్బు ఖర్చు చేసి కొనుగోలు చేసుకున్నా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఉక్కపోతను అనుభవించాల్సి ఉంటుంది. అయితే విద్యుత్తుతో అవసరం లేకుండా చల్లటి గాలి పొందాలంటే సౌరశక్తిని మించిన ఇందనం ఏముందని మిట్స్ ఇంజినీరింగ్ విద్యార్థులు ఆలోచించారు. వారి ఆలోచనలకు అధ్యాపకుల సలహాలు తోడు కావడంతో సోలార్ ఆపరేటెడ్ పర్యావరణ రక్షిత సోలార్ ఎయిర్ కూలర్‌ను తయారు చేసి అందరితో ప్రశంసలు అందుకున్నారు.
ఏవిధంగా తయారు చేశారంటే...
మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వాసు, వెంకటేష్, శరవణన్, రుత్విక్‌లు బృందంగా ఏర్పడి గైడ్ అధ్యాపకుడు ముప్పా లక్ష్మణరావు ఆధ్వర్యంలో సోలార్ ఆపరేటెడ్ కూలర్‌ను తయారు చేయడం మొదలు పెట్టారు. ఇందుకోసం దీర్ఘచతురస్త్రాకార పెట్టెను తయారు చేశారు. ముఖ భాగంలో 12 వోల్టుల డీసీ ఫ్యాన్ ఏర్పాటు చేశారు. కుండలను తయారు చేసే మట్టితో గ్లాసులను తయారు చేశారు. ఇనుప చువ్వలతో మెష్ తయారు చేసి దానికి గ్లాసులను అమర్చారు. గ్లాసులు రెండు వైపుల తెరచి ఉండేలా తయారు చేసుకోడం వల్ల సులభంగా మెష్‌కు గ్లాసులు అమర్చారు. వీటిపై భాగంలో 6 వోల్ట్ డీసీ పంపును అమర్చారు. ఈ డీసీ పంపు కొద్దికొద్దిగా నీటిని మట్టి గ్లాసులపైకి పంపుతుంది. నీటిని నిల్వ చేసుకునేందుకు కింది భాగంలో చతురస్రాకారంలో బాక్సును ఏర్పాటు చేసి అందులో నీటిని నింపారు. ఈ నీటిలోనే డీసీ పంపు పైపును ఉంచారు. 12 వోల్ట్‌ల డీసీ బ్యాటరీని 15 వాట్ల సోలార్ ప్యానల్‌కు అనుసంధానం చేశారు. ఇప్పుడు సోలార్ ఎనర్జీ వల్ల డీసీ బ్యాటరీలోకి విద్యుత్తు సరఫరా వచ్చి సోలార్ ఎయిర్ కండిషనర్ పనిచేస్తుంది.
ఎలా పనిచేస్తుందంటే..
విద్యార్థులు తయారు చేసిన సోలార్ ఆపరేటెడ్ పర్యావరణ రక్షిత కూలర్ సోలార్ ఎనర్జీని గ్రహించి డీసీ బ్యాటరీ ద్వారా ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ తిరిగే సమయంలోనే చతురస్త్రాకారంలో ఉన్న బాక్సులోని నీటిని ఆరు వోల్టుల డీసీ పంపు నీటిని తీసుకుని మట్టి గ్లాసులపై నీటిని వదులుతుంది. గ్లాసులపై పడే నీరు నిరుపయోగం కాకుండా మళ్లీ కింద ఉన్న బాక్సులోకి పడుతుంది. ఫ్యాను తిరిగితే మట్టి గ్లాసులు తడిగా ఉండటం వల్ల వాటి ద్వారా వచ్చే గాలి, వర్షం సమయంలో వచ్చే చల్లటి గాలిని పోలి ఉంటుంది. దీని కోసం రూ.3 వేలు ఖర్చు చేశామని పేద ప్రజలకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. విద్యుత్తు సరఫరా లేకున్నప్పటికీ సోలార్ ద్వారా దీన్ని వినియోగించుకోవచ్చు కాబట్టి ఏ ప్రాంతంలోనైనా అమర్చుకునే వెసులుబాటు ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. సోలార్ ఆపరేటెడ్ పర్యావరణ రక్షిత కూలర్‌ను తయారు చేసిన విద్యార్థులను కరస్పాండెంట్ విజయభాస్కర్‌చౌదరి, ప్రిన్సిపల్ యువరాజ్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు అభినందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్: బాలకృష్ణ
-
Jammu Kashmir: కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి
-
Pawan Kalyan: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్ కల్యాణ్
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి