రహదారి నిర్మాణంపై నిర్లక్ష్యం తగదు
వేంపల్లె-రాయచోటి మార్గంలో చేపట్టిన నాలుగు వరుసల రహదారి నిర్మాణంపై నిర్లక్ష్యం తగదని రాష్ట్ర కాంగ్రెస్ మీడియా సెల్ ఛైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు.
రహదారి నిర్మాణ పనులను పరిశీలిస్తున్న తులసిరెడ్డి
వేంపల్లె, న్యూస్‌టుడే: వేంపల్లె-రాయచోటి మార్గంలో చేపట్టిన నాలుగు వరుసల రహదారి నిర్మాణంపై నిర్లక్ష్యం తగదని రాష్ట్ర కాంగ్రెస్ మీడియా సెల్ ఛైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లె మార్గంలో చేపట్టిన రోడ్డు పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేంపల్లె-రాయచోటి మార్గంలో కొత్తగా నాలుగు వరుసల రోడ్డు మంజూరైందన్నారు. ఈ మేరకు గుత్తేదారు రోడ్డు అంతటిని తవ్వేశారన్నారు. రెండేళ్లు కావస్తున్న పాతరోడ్డు స్థానంలో కొత్తరోడ్డు నిర్మాణం పూర్తిచేయలేదన్నారు. రోడ్డు సరిగా లేని కారణంగా గంట ప్రయాణానికి రెండు గంటలకు పైగా సమయం పడుతోందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుత్తేదారుపై ఒత్తిడి తెచ్చి రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!
-
Floods: సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు