logo

విశ్వవిద్యాలయం అభివృద్ధిలో బోధనేతర సిబ్బంది పాత్ర కీలకం

విశ్వవిద్యాలయం కుటుంబసభ్యులంతా నిజాయతీ, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తే యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే మొదటి స్థానానికి తీసుకెళతానని ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌ పేర్కొన్నారు.

Published : 02 Jun 2023 05:11 IST

యోవేవి ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌  

మాట్లాడుతున్న ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌, పక్కన రిజిస్ట్రార్‌ వెంకటసుబ్బయ్య

వైవీయూ (కడప), న్యూస్‌టుడే: విశ్వవిద్యాలయం కుటుంబసభ్యులంతా నిజాయతీ, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తే యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే మొదటి స్థానానికి తీసుకెళతానని ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో పనిచేసే బోధనేతర సిబ్బందితో గురువారం ఆయన సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయం అభివృద్ధిలో బోధనేతర సిబ్బంది పాత్ర కీలకమని, వీరిలో 80 శాతం మంది డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ వంటి అర్హత గలవారుండడం శుభపరిణామన్నారు. సమావేశంలో కులసచివులు ఆచార్య వైపీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాచార్యులకు అభినందనలు... యోవేవి విద్యార్థుల సమగ్ర ప్రగతికి కృషి చేస్తానని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు ఆచార్య ఎస్‌.రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వైవీయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు గురువారం ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌, కులసచివులు వైపీ వెంకటసుబ్బయ్య, పూర్వ ప్రధానాచార్యులు కె.కృష్ణా రెడ్డి, పాలకమండలి సభ్యురాలు ఆచార్య పద్మ, సీఈ ఎన్‌.ఈశ్వర్‌రెడ్డి, ఐటీ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య ఎంవీ.శంకర్‌ పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
దూరవిద్య సంచాలకుడిగా ఆచార్య కృష్ణారెడ్డి .. యోగి వేమన విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం సంచాలకుడిగా భౌతికశాస్త్ర శాఖ ఆచార్యులు కె.కృష్ణారెడ్డిని నియమించారు. ఈ మేరకు వర్సిటీ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్‌, కులసచివులు ఆచార్య వైపీ వెంకటసుబ్బయ్యల నుంచి గురువారం నియామక ఉత్తర్వులను అందుకున్నారు.గతంలో ఈ స్థానంలో పనిచేసిన వృక్షశాస్త్రశాఖ ఆచార్యులు పీఎస్‌ షావలీఖాన్‌ విధుల నుంచి రిలీవ్‌ అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు