logo

పకడ్బందీగా గ్రూప్‌-1 పరీక్షలు

బెరైటీస్‌ అక్రమ రవాణాపై సమగ్ర విచారణ .జరుగుతోందని ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తెలిపారు. ఈ ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహించే గ్రూప్‌-1 పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో గంగాధర్‌గౌడ్‌ ఆదేశించారు.

Published : 02 Jun 2023 05:11 IST

వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తున్న డీఆర్వో గంగాధర్‌ గౌడ్‌

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహించే గ్రూప్‌-1 పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో గంగాధర్‌గౌడ్‌ ఆదేశించారు. గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.45 గంటలలోపు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు.  కడప నగర శివార్లలోని అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాల్లో నిర్వహించే పరీక్షలకు 414 మంది అభ్యర్థులు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు, గర్భిణులకు కిందస్తుల్లోనే పరీక్ష నిర్వహించేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సమీక్షలో లైజన్‌ అధికారి మల్లికార్జున, ఏపీపీఎస్సీ సెక్షన్‌ అధికారులు అశోక్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని