logo

ఏడుగురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్టు

తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో గంజాయిని కొనుగోలు చేసి చెన్నైకు తీసుకొచ్చి అక్కడ నుంచి కడపకు తరలిస్తున్న ఏడుగురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను చింతకొమ్మదిన్నె పోలీసులు అరెస్టు చేశారు.

Published : 03 Jun 2023 02:33 IST

21 కిలోలు స్వాధీనం

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో గంజాయిని కొనుగోలు చేసి చెన్నైకు తీసుకొచ్చి అక్కడ నుంచి కడపకు తరలిస్తున్న ఏడుగురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను చింతకొమ్మదిన్నె పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 21 కిలోల గంజాయి, 4 చరవాణులు, 2 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో ముగ్గురు చెన్నైకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులుండడం గమనార్హం. అరెస్టయినవారిని శుక్రవారం ఎస్పీ అన్బురాజన్‌ మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు..‘ గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో స్మగ్లర్లపై దాడులు చేశాం. తొలుత కడప నగరంలోని అక్కాయపల్లెకు చెందిన మల్లికార్జున్‌రెడ్డిని అరెస్టు చేశాం.  అతడు చెప్పిన సమాచారంతో చెన్నైలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న మైదుకూరుకు చెందిన టి.వెంకట శివారెడ్డి, గుంటూరుకు చెందిన రాహుల్‌,  అక్కాయపల్లెకు చెందిన జి.హరిప్రసాద్‌ (మధ్యలో ఇంజినీరింగ్‌ ఆపేశాడు)లతో పాటు  నభీకోటకు చెందిన పవన్‌కుమార్‌, కె.ప్రతాప్‌, పెండ్లిమర్రి మండలం వెల్లటూరుకు చెందిన నరసింహులులను అరెస్టు చేశాం.’ అని ఎస్పీ వివరించారు. ‘కేసులో ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు కీలకం. వీరు ఖమ్మం వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి అక్రమ మార్గంలో చెన్నైకు తరలించి అక్కడున్న ఇంజినీరింగ్‌ కళాశాలలో విక్రయిస్తుండడంతోపాటు కడపకు తీసుకొచ్చి పవన్‌కుమార్‌, ప్రతాప్‌, నరసింహులు ద్వారా విక్రయించేవారు.’ అని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ తుషార్‌ డూడి, కడప డీఎస్పీ షరీఫ్‌, సీఐలు ఉలసయ్య, రాజాప్రభాకర్‌, ఎస్‌.ఐ.అరుణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని