ఒడిశా రైలు ప్రమాద బాధితుల కోసం టోల్‌ప్రీ నంబరు 08561293006
ఒడిశాలో రైలు ప్రమాదం జరగడం చాలా బాధాకరమని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మాట్లాడుతున్న కలెక్టర్ గిరీష, పక్కన జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్
రాయచోటి, న్యూస్‌టుడే: ఒడిశాలో రైలు ప్రమాదం జరగడం చాలా బాధాకరమని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించి జిల్లాకు చెందిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే అందించాలని సూచించారు. బాధితుల సౌకర్యార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ప్రమాదంలో జిల్లా వాసులు ఎవరైనా ఉంటే తక్షణమే వారి కుటుంబసభ్యులు కంట్రోల్ రూంను సంప్రదించాలన్నారు. రైలు ప్రమాదానికి సంబంధించి జిల్లా వాసుల నుంచి ఎటువంటి సమాచారమున్నా టోల్‌ప్రీ నంబరు 08561293006కు వెంటనే తెలియజేయాలని ఆయన కోరారు. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి సహాయక చర్యలు చేపడుతుందన్నారు. జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండలస్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వివరాలపై ఆరా తీయనున్నట్లు తెలిపారు. రైల్వేశాఖతో కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారం పంచుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఆయనవెంట జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి