అక్రమ తవ్వకాలకు పునాది!
రాజంపేట నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.
రాజంపేట నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. పునాది రాళ్ల కోసం రాజంపేట మండలం పోలి, మందరం గ్రామ పంచాయతీల్లో విచ్చలవిడిగా కొండలను పిండి చేస్తున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతుండడంతోపాటు వాహనాల రాకపోకలకు కొండలపై రహదారులు సైతం నిర్మాణం చేపట్టడం గమనార్హం. ట్రాక్టరుకు రూ.3 వేలు చొప్పున ప్రతిరోజూ 50కుపైగా ట్రాక్టర్లలో రాళ్లను తరలించి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై తహసీల్దారు సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ తవ్వకాలకు ఎలాంటి అనుమతుల్లేవన్నారు. అక్రమ తవ్వకాల వ్యవహారం మా దృష్టికి వచ్చిందని, వెంటనే దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Hyderabad: చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనలో స్థానికులు
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి