ఉద్యానానికి ఉపాధి ఊతం
సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
వైయస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లో 13 వేల ఎకరాల ఎంపిక
జులై 15వతేదీలోగా మొక్కల నాటే పనులకు గడువు విధింపు
కడప, న్యూస్‌టుడే: సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. బంజరు భూములు, మెట్ట ప్రాంతాల్లో పండ్లు, పూల తోటలను సాగు చేయాలని ఆసక్తి చూపుతున్న ఔత్సాహిక రైతులకు ఉపాధిహామీ పథకం కింద ఊతమివ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులు నిర్ణయించారు. సన్న, చిన్నకారు కర్షకులకు నరేగా నిధులు కేటాయించి అండగా నిలవాలని సంకల్పించారు. క్షేత్రస్థాయిలో కర్షకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని ఉత్తర్వులందాయి. మొక్కల ఎంపిక, నాటే పనులను వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా వైయస్‌ఆర్ జిల్లాలో 8 వేలు, అన్నమయ్య జిల్లాలో 5 వేల ఎకరాల్లో పండ్లు, పూల తోటలు సాగు చేయించాలని ఆయా జిల్లాల అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ నెల 15వ తేదీలోగా పరిపాలన అనుమతివ్వాలని ఉత్తర్వులిచ్చారు. ఈ నెలాఖరుకు గుంతలు తవ్వకం పనులు పూర్తి చేయాలని, వర్షాలు కురవగానే జులై 15వ తేదీ నాటికి మొక్కలను నాటించేవిధంగా ప్రణాళికను రూపొందించారు. అధికారికంగా గుర్తింపు పొందిన నర్సరీల్లో మొక్కలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల వరకు నిర్వహణ పద్దు ఇస్తారు. ఈ విషయమై వైయస్‌ఆర్, అన్నమయ్య పీడీలు యదుభూషణ్‌రెడ్డి, మద్దిలేటి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో ఉద్యాన తోటల సాగును ప్రోత్సహించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. సన్న, చిన్నకారు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి