ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నిరసన
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఒప్పంద కార్మికులు, పింఛనుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాసులరెడ్డి, జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ ఆరోపించారు.
రాజంపేట తహసీల్దారు కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగులు
రాజంపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఒప్పంద కార్మికులు, పింఛనుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాసులరెడ్డి, జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ ఆరోపించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట శనివారం వారు ఉద్యోగులతో కలిసి రిలేనిరాహార దీక్ష చేపట్టారు. ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలివ్వాలని, ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరించాలని, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండు చేశారు. జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ సొమ్ముకు భద్రత కల్పించాలన్నారు. సమస్యల పరిష్కారానికి గత నాలుగేళ్లుగా ప్రభుత్వానికి విన్నవించినా, ప్రభుత్వంతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయిందన్నారు. జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ కోసం విడుదల చేసిన సొమ్ము ఉద్యోగులకు అదనంగా ఇచ్చిందేమీకాదని, మా సొమ్మును వాడుకుని అందులో కొంత మొత్తాన్ని జమ చేశారేగానీ అదనంగా ఇచ్చిందేమీలేదన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు సిద్దరామయ్య, రాజశేఖర్, మణికంఠ, శ్రీధర్, రవిశంకర్, రాజు, కవిత, గోవింద్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!
-
Sreeleela: వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉంటా.. ఆ జానర్‌పై ఇష్టం పెరిగింది: శ్రీలీల
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి