logo

అతిసార నియంత్రణ పక్షోత్సవాలు విజయవంతం చేయాలి

జిల్లాలో ఉద్ధృత అతిసార, డయేరియాలను పూర్తిగా నిర్మూలించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు వైద్య సిబ్బందిని ఆదేశించారు.

Published : 06 Jun 2023 02:41 IST

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు, జేసీ గణేష్‌కుమార్‌, వైద్యాధికారులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో ఉద్ధృత అతిసార, డయేరియాలను పూర్తిగా నిర్మూలించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు వైద్య సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో ఐడీసీఎఫ్‌ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రాలను సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులతో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించారు. అయితో తేదీ నుంచి 17వ తేదీ వరకు పక్షోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పుట్టిన బిడ్డ మొదలుకుని ఐదేళ్ల లోపు చిన్నారులకు డయేరియా.. దాని వల్ల సంభవించే మరణాలను పూర్తిగా అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా అందరూ కష్టించి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ గణేష్‌కుమార్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఖాదర్‌వలి, జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు, వైద్యులు డాక్టర్‌ మల్లేశ్వరి, డీఐవో ప్రమీల, డెమో రాధాకృష్ణారెడ్డి, ఎంపీహెచ్‌ఈవో మురళీకృష్ణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు