logo

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన

ప్రభుత్వ పాఠశాలలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి ఆరోపించారు.

Published : 06 Jun 2023 02:41 IST

ధర్నా చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు, మధ్యాహ్న భోజన కార్మికులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి ఆరోపించారు. కడప కలెక్టరేట్‌ ఎదుట కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలోని మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ... 20 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేస్తున్న ఏజెన్సీలకు నేటికీ సరైన గుర్తింపులేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి విద్యార్థికి రూ.30 మెస్‌ ఛార్జీ పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్‌, కేసీబాదుల్లా, మద్దిలేటి, చాంద్‌బాషా, నారాయణ, వెంకటరాముడు, కామాక్షమ్మ, మేరీ, లక్ష్మీపార్వతి, సులోచన, గౌస్‌పీర్‌, ఈశ్వర్‌రెడ్డి, రమణమ్మ, బీబీ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని