logo

‘ప్రభుత్వ భూములన్నీ పెత్తందార్లకేనా’

జిల్లాలోని ప్రభుత్వ భూములను పెత్తందార్లకు అప్పగించేందుకే రెవెన్యూ అధికారులున్నట్లున్నారని మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 06 Jun 2023 02:41 IST

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న మాల మహానాడు నేతలు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ భూములను పెత్తందార్లకు అప్పగించేందుకే రెవెన్యూ అధికారులున్నట్లున్నారని మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్‌ ఆరోపించారు. ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాలమహానాడు నాయకులు సోమవారం అంబేడ్కర్‌ కూడలి నుంచి మహావీర్‌ కూడలి మీదుగా కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కడప, ఖాజీపేట, మైదుకూరు, మైలవరం, జమ్మలమడుగు, పెండ్లిమర్రి మండలాల్లో ప్రభుత్వ భూములను అగ్రకులాలు, రెవెన్యూ అధికారులతో కలిసి భూదోపిడీకి పాల్పడుతున్నారన్నారు. మైదుకూరులో దళితులకు ఇచ్చిన భూములను పోలీసులతో కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఆయా మండలాల్లో భూములపై విచారణ చేపట్టి సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రామాజీ ఇమ్మాన్యుయేలు, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, గౌరవాధ్యక్షుడు మురళీప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని