logo

జయరామిరెడ్డికి నేతల పరామర్శ

వైకాపా నాయకుడి దాడిలో గాయపడిన గోపవరం తెదేపా జడ్పీటీసీ సభ్యుడు జయరామిరెడ్డిని ఆ పార్టీ మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పరామర్శించారు.

Published : 07 Jun 2023 02:33 IST

జడ్పీటీసీ సభ్యుడిని పరామర్శిస్తున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, రెడ్యం తదితరులు

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే: వైకాపా నాయకుడి దాడిలో గాయపడిన గోపవరం తెదేపా జడ్పీటీసీ సభ్యుడు జయరామిరెడ్డిని ఆ పార్టీ మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పరామర్శించారు. మంగళవారం కడపలో చికిత్స పొందుతున్న జయరామిరెడ్డిని పరామర్శించి దాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులతో చర్చించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. నాయకులు మాట్లాడుతూ జయరామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు గోపవరం మండలంలోని సండ్రపల్లెలోని తన నివాసంలో ఉంటే వైకాపా నాయకులు బై ఎలక్షన్‌ కోసం దాడులు చేయడం దుర్మార్గమన్నారు. వైకాపా నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జయరామిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జయరామిరెడ్డి ఇంటి వద్ద తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, రితీష్‌రెడ్డి, భూపేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని