logo

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

ముందు వెళ్తున్న కారును వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఓ రైతు మృతి చెందిన సంఘటన బి.కొత్తకోట మండలంలో మంగళవారం జరిగింది.

Published : 07 Jun 2023 02:23 IST

బయారెడ్డి (పాత చిత్రం)

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: ముందు వెళ్తున్న కారును వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఓ రైతు మృతి చెందిన సంఘటన బి.కొత్తకోట మండలంలో మంగళవారం జరిగింది. పెద్దతిప్పసముద్రం మండలం బూర్లపల్లెకు చెందిన బయారెడ్డి (50) వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బయారెడ్డి ద్విచక్ర వాహనంలో సొంతపనిపై బి.కొత్తకోటకు వెళ్తుండగా మల్లెల క్రాస్‌ వద్దకు వెళ్లగానే ముందు వెళ్తున్న కారును అధిగమించబోయి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బయారెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు 108లో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేశారు.


కారు ఢీకొని ద్విచక్ర వాహనదారు...

రామాపురం : కర్నూలు- చిత్తూరు జాతీయరహదారిపై గువ్వలచెరువు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్బార్‌బాషా (35) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కొండారెడ్డి తెలిపారు. సుండుపల్లి మండలం రాయవరానికి చెందిన దర్బార్‌బాషా గువ్వలచెరువులోని వారి బంధువుల ఇంటికి వచ్చి తిరిగి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, కడప నుంచి రాయచోటి వైపు వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో దర్బార్‌బాషా అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


కారు బోల్తాపడి ఆరోగ్య శాఖ ఉద్యోగి...

రమేష్‌ బాబు (పాత చిత్రం)

రామాపురం : మండలంలోని హసనాపురం పంచాయతీ కొండవాండ్లపల్లె సమీపంలో కారు బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందారు. తిరుపతికి చెందిన రమేష్‌బాబు(58) ఆరోగ్య శాఖ డివిజనల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన మంగళవారం హసనాపురం పంచాయతీ పప్పిరెడ్డిగారిపల్లెలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి కారులో బయలుదేరారు.  చెరువు కట్టపైకి రాగానే టైరు పగిలి కారు బోల్తాపడింది.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రమేష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని లక్కిరెడ్డిపల్లె సీఐ వరప్రసాద్‌ పరిశీలించారు. కేసు నమేదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై కొండారెడ్డి తెలిపారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని