logo

స్నేహితుడే హంతకుడు

తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె సమీపంలో ఈ నెల 3వ తేదీ రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ కేశప్ప వెల్లడించారు.

Published : 07 Jun 2023 02:33 IST

హత్యకేసులో నిందితుడి అరెస్టు

నిందితుడిని చూపుతున్న డీఎస్పీ కేశప్ప, సీఐ శివాంజనేయులు, ఎస్‌ఐ రామాంజనేయుడు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె సమీపంలో ఈ నెల 3వ తేదీ రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ కేశప్ప వెల్లడించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కోసువారిపల్లె సమీపంలో ఎర్రివారిపల్లెకు చెందిన రామిగాని ఎర్రంరెడ్డి (32)పై హత్యాయత్నం జరిగింది. తిరుపతిలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని తల్లి రాధమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎర్రంరెడ్డి స్నేహితుడైన గుమ్మడికాయలవారిపల్లెకు చెందిన మధుకర్‌రెడ్డి (32)ని నిందితుడిగా గుర్తించారు. ఈ నెల 3వ తేదీ రాత్రి ఎర్రంరెడ్డి, మధుకర్‌రెడ్డి తమ పొలానికి సమీపంలోనే మద్యం తాగేందుకు వెళ్లారని అక్కడ నగదు లావాదేవీల విషయమై గొడవ జరిగింది. ఈ గొడవలో మధుకర్‌రెడ్డి తన స్నేహితుడైన ఎర్రంరెడ్డిని బండరాయితో తలపై రెండు సార్లు కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడన్నారు. ఎర్రంరెడ్డి గట్టిగా కేకలేయడంతో చుట్టుపక్కల పొలాల్లో ఉన్న వారు వచ్చే సరికి మధుకర్‌రెడ్డి పరారయ్యాడన్నారు. ఈ కేసులో నిందితుడి కోసం గాలిస్తుండగా సోమవారం మధుకర్‌రెడ్డి ముదివేడు క్రాస్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. నిందితుడిని విచారించగా నేరం తానే చేశానని ఒప్పుకొన్నాడని డీఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు