కొండలపై ఇళ్లు నిర్మించుకోలేం సారూ..!
అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగిన ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఇళ్ల నిర్మాణానికి వీలు లేకుండా ఉన్నాయని పలువురు బాధితులు కలెక్టర్ గిరీష ఎదుట వాపోయారు.
కలెక్టర్‌కు వరద బాధితుల మొర
కలెక్టర్ గిరీషకు సమస్యలు వివరిస్తున్న రామాచంద్రాపురం వరద బాధితులు
రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగిన ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఇళ్ల నిర్మాణానికి వీలు లేకుండా ఉన్నాయని పలువురు బాధితులు కలెక్టర్ గిరీష ఎదుట వాపోయారు. ఆయా నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం, తొగురుపేట గ్రామాల పరిధిలో బాధితులు మాట్లాడుతూ కొండపై కొంత మందికి, ఏటవాలు భాగంలో మరి కొందరికి పట్టాలు ఇచ్చారని, ఇక్కడ ఇంటిని నిర్మించుకోవడం కష్టంగా ఉందని తెలిపారు. కొంతమంది తమకు పాటూరు గ్రామ పరధిలో పట్టాలు ఇవ్వాలని, రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిర్మాణానికి అనుకూలంగా ఉన్న మరో ప్రాంతంలో పట్టాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలని, ఆయా యజమానులతో మాట్లాడి నివేదిక పంపాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఆయా ప్రాంతాల్లో మంచినీరు, రోడ్లు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Justin Trudeau: జీ20 సదస్సు సందర్భంగా ప్రెసిడెన్షియల్ సూట్‌ను తిరస్కరించిన ట్రూడో..!
-
Balakrishna: తెలుగు సినీ పరిశ్రమను వైకాపా నేతలు కించపరిచారు: బాలకృష్ణ
-
IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. కళ్లన్నీ వారిపైనే.. ఫైనల్ XI ఎలా ఉండనుందో?
-
DIG Ravi Kiran: జైలులో రిమాండ్ ఖైదీ మృతి.. డీఐజీ ఏమన్నారంటే..
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
AP High Court: అంగళ్లు కేసుల్లో 79 మంది తెదేపా నేతలకు బెయిల్