బద్వేలు వైకాపాలో తిరుగుబావుటా
బద్వేలు నియోజకవర్గ వైకాపా నేతలు పలువురు తిరుగుబావుటా ఎగురవేశారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో కలిసి పని చేసే ప్రసక్తేలేదని తేల్చారు.
పోరుమామిళ్ల మండలంలో నేతల భేటీ
ఎమ్మెల్సీ గోవిందరెడ్డిపై విమర్శల వెల్లువ
పోరుమామిళ్ల మండలం రామిరెడ్డికుంట సమీపంలో సమావేశమైన వైకాపా అసమ్మతి నేతలు
ఈనాడు, కడప, న్యూస్‌టుడే- కాశినాయన: బద్వేలు నియోజకవర్గ వైకాపా నేతలు పలువురు తిరుగుబావుటా ఎగురవేశారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో కలిసి పని చేసే ప్రసక్తేలేదని తేల్చారు. వందలాదిగా సమావేశమైన అసమ్మతి నేతలకు ఎమ్మెల్సీకి స్వయాన బామ్మర్ది, కాశినాయన మండల వైకాపా కన్వీనర్ విశ్వనాథరెడ్డి, సోదరుడు, కాశినాయన జడ్పీటీసీ సభ్యుడు సత్యనారాయణరెడ్డి నేతృత్వం వహించడం విశేషం. పోరుమామిళ్ల మండలం రామిరెడ్డికుంట గ్రామానికి సమీపంలో ఆదివారం అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. వైకాపా ప్రభుత్వంలో తాము పడుతున్న ఇబ్బందులు, ఎమ్మెల్సీ తీరుతో పార్టీకి జరుగుతున్న నష్టంపై నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొందరైతే పలు ఆరోపణలు గుప్పించారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కడప పర్యటన సందర్భంగా కలిసే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. నియోజకవర్గంలో కీలక నేతలు పట్టించుకోకపోవడంతో నేతలు, కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారని.. కనీసం సిఫార్సు లేఖలకు కూడా నోచుకోలేకపోతున్నామని నేతలు వాపోయారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్సీ నేతృత్వంలో పని చేసే ప్రసక్తేలేదని తీర్మానించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కొందరైతే పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నట్లు విస్పష్టమైన ప్రకటన చేసినట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వీరిలో చాలా మంది గత కొన్ని నెలలుగా పార్టీకి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. కష్టాల్లో పార్టీ వెంట నడువగా.. కీలక నేతలే ఫలితాలు అనుభవిస్తున్నారని.. నేతలు, కార్యకర్తలు ఇబ్బందుల పాలవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో భారీ ఎత్తున భూదందాలు సాగాయి. వీటిలో కొందరు అక్రమాన్ని సక్రమం చేసుకోగలిగారు. కొందరి విషయంలో కీలక నేతలు పట్టించుకోలేదనే విమర్శ ఉంది. అధికారులను కీలక నేతలు తమ గుప్పిట్లో పెట్టుకుని.. ఇతరులకు పనులు చేయకుండా పరోక్షంగా ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఇలా నేతలు సమావేశంలో మాట్లాడుతూ... తమ అసమ్మతి గళాన్ని వినిపించారు. సమావేశంలో మాజీలతో పాటు ప్రస్తుత జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News: ఎన్సీఆర్బీ పేరిట ఫేక్ మెసేజ్.. విద్యార్థి ఆత్మహత్య.. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముంది?
-
Maneka Gandhi: మేనకా గాంధీపై ఇస్కాన్ రూ.వంద కోట్ల పరువు నష్టం దావా
-
Kriti Sanon: సినిమా ప్రచారం కోసం.. రూ. 6 లక్షల ఖరీదైన డ్రెస్సు!
-
Pawan Kalyan: కృష్ణా జిల్లాలో 5రోజుల పాటు పవన్ వారాహి యాత్ర
-
Social Look: లండన్‌లో అల్లు అర్జున్.. చెమటోడ్చిన ఐశ్వర్య.. సెట్లో రష్మి
-
Britney Spears: కత్తులతో డ్యాన్స్.. పాప్ సింగర్ ఇంటికి పోలీసులు