logo

అకుంఠిత దీక్షలు.. ఆగ్రహ జ్వాలలు

తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి.

Updated : 21 Sep 2023 06:48 IST

చంద్రబాబునాయుడి అరెస్టుపై సర్వత్రా నిరసనలు
ఉద్ధృతమవుతున్న తెలుగు తమ్ముళ్ల ఆందోళనలు

రైల్వేకోడూరులో తెదేపా నేత కస్తూరి విశ్వనాథనాయుడు ఆధ్వర్యంలో రిలే
నిరాహార దీక్షలు చేస్తున్న నాయకులు, కార్యకర్తలు

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, బృందం: తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. 11వ రోజు బుధవారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు. సీఎం జగన్‌ చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనలేక అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. తమ అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండు చేశారు. పలు చోట్ల మైనార్టీ నేతలు దీక్షల్లో పాల్గొనడంతో పాటు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. కడప నగరంలోని ప్రకాష్‌నగర్‌లో నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాధవి ఆధ్వర్యంలో బీసీ వర్గాల నేతలతో రిలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. బద్వేలులో పార్టీ శ్రేణులు పాల్గొన్న రిలే నిరాహార దీక్షకు యువ నాయకుడు రితేష్‌రెడ్డి హాజరై వైకాపా ప్రభుత్వ అన్యాయాలను ఎండగట్టారు. పులివెందులలో జరిగిన రిలే నిరాహార దీక్షలో తెదేపా వైయస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, రాష్ట్ర నాయకులు సురేష్‌నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాలు కొనసాగాయి. సురేష్‌నాయుడు నిర్వహిస్తున్న దీక్షలో వరదరాజులరెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆలయాల్లో పూజలు, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. జమ్మలమడుగులో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగగా, పెద్దసంఖ్యలో రైతులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. మైదుకూరులో జరిగిన దీక్షకు పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కమలాపురంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో వందలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రైల్వేకోడూరులో నియోజకవర్గ బాధ్యుడు కస్తూరి విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. మదనపల్లెలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలో జనసేన పార్టీ నాయకులు పాల్గొనగా, ఇరు పార్టీల నాయకులు పోస్టుకార్డుల ఉద్యమం నిర్వహిచారు. పలు కార్యక్రమాల్లో జనసేన పార్టీ రాయలసీమ బాధ్యుడు రాందాస్‌చౌదరి పాల్గొన్నారు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి, రాజంపేటలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రిలే నిరాహార దీక్షలు జరిగాయి.

బద్వేలులో  రిలే నిరాహార దీక్షలో మాట్లాడుతున్న తెదేపా యువ నాయకుడు రితేష్‌రెడ్డి, పార్టీ శ్రేణులు

 

జమ్మలమడుగులో నిరసన తెలుపుతున్న తెదేపా వైయస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి, నాయకులు

 


రిలే నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా పులివెందుల పురపాలక సంఘం నాయకులు, కార్యకర్తలు

 

మదనపల్లె అన్నమయ్య కూడలిలో రిలే నిరాహార దీక్షల్లో పోస్టుకార్డులతో ప్రదర్శన నిర్వహిస్తున్న తెదేపా రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌, నాయకులు త్యాగరాజు, వెంకటరమణ, యశశ్విరాజ్‌, చరణ్‌తేజ్‌ తదితరులు

 



రాజంపేటలోని రిలే నిరాహార దీక్షల్లో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు, పార్టీ శ్రేణులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని