logo

ట్రిపుల్‌ఐటీ విద్యార్థి మృతదేహం తల్లిదండ్రులకు అప్పగింత

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో బలవన్మరణానికి పాల్పడిన సివిల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి నేర్జాంపల్లె గంగారం మృతదేహాన్ని బుధవారం వైద్యులు తల్లిదండ్రులకు అప్పగించారు.

Published : 21 Sep 2023 05:11 IST

విద్యార్థి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న భాజపా  జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి

వేంపల్లె, న్యూస్‌టుడే: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో బలవన్మరణానికి పాల్పడిన సివిల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి నేర్జాంపల్లె గంగారం మృతదేహాన్ని బుధవారం వైద్యులు తల్లిదండ్రులకు అప్పగించారు. స్థానిక వైద్యవిధాన పరిషత్తు అసుపత్రిలో సదరు విద్యార్థి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆర్కేవ్యాలీ సీఐ గోవిందరెడ్డి, వేముల ఎస్‌.ఐ. ధనుంజయుడు ఆధ్వర్యంలో మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థి బలవన్మరణంతో వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా క్యాంపస్‌లో నిర్వహించాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలను రద్దుచేశారు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆత్మహత్యకి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్‌రెడ్డి అసుపత్రి వద్దకు చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు. ట్రిపుల్‌ఐటీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆయనతో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గాలిహరిప్రసాద్‌, భాజపా మండలశాఖ అధ్యక్షుడు సునీల్‌ కుమార్‌, కిరణ్‌కుమార్‌, చరణ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు