logo

బాల్య వివాహాలపై కఠిన చర్యలు

బాల్య వివాహాలు చేసినా, హాజరైనా, వేదికకు అవకాశం కల్పించినా కఠిన చర్యలుంటాయని కలెక్టర్‌ విజయరామరాజు హెచ్చరించారు.

Published : 21 Sep 2023 05:11 IST

ప్రసంగిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు, పక్కన ఐసీడీఎస్‌ పీడీ శ్రీలక్ష్మి,  ట్రైనీ కలెక్టర్‌  భరద్వాజ్‌

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చేసినా, హాజరైనా, వేదికకు అవకాశం కల్పించినా కఠిన చర్యలుంటాయని కలెక్టర్‌ విజయరామరాజు హెచ్చరించారు. కలెక్టరేట్‌లో బుధవారం బాల్యవివాహాల నివారణపై స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిగితే ఆ పరిధిలోని వాలంటీర్లపై కూడా చర్యలు తప్పవన్నారు. పాఠశాలల్లో బాలికల డ్రాపౌట్స్‌పై కచ్చితంగా నిఘా ఉండాలని, తిరిగి వాళ్లను మళ్లీ బడుల్లో చేర్పించే వరకు విద్యాశాఖాధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. స్కూల్‌ డ్రాపౌట్లకు పెళ్లి జరిగితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆశ, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలపై కూడా కేసు పెడతామని హెచ్చరించారు. ప్రతి సచివాలయంలో పెళ్లి రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించి విస్తృత ప్రచారం చేపట్టాలని చెప్పారు. ఆపదలో ఉన్న బాలలు తక్షణ సాయం కోసం 181, 1098, 100, 112 టోల్‌ఫ్రీనంబర్లకు ఫోన్‌ చేయాలని పేర్కొన్నారు.  అనంతరం గోడపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ భరద్వాజ్‌, ఐసీడీఎస్‌ పీడీ శ్రీలక్ష్మీ, ఆర్డీవోలు ధర్మచంద్రారెడ్డి, వెంకటేశం, శ్రీనివాసులు, డీసీపీవో సుభాష్‌యాదవ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని