logo

ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలేవి?

వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సౌకర్యాల్లేవని, ఇన్నాళ్లు పనిచేసిన ప్రజాప్రతినిధులను 108 సిబ్బంది ప్రశ్నించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 21 Sep 2023 05:11 IST

ప్రశ్నించిన 108 ఉద్యోగి
వీడియో వైరల్‌

మైదుకూరు, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సౌకర్యాల్లేవని, ఇన్నాళ్లు పనిచేసిన ప్రజాప్రతినిధులను 108 సిబ్బంది ప్రశ్నించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నియోజకవర్గం పరిధిలోని బ్రహ్మంగారిమఠం మండలంలోని 108 ఉద్యోగిగా పనిచేస్తున్న వీరమల్ల సాంబశివయ్య మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ప్రభుతాసుపత్రుల్లో ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ తదితర మౌలిక సౌకర్యాల లేమిపై ప్రశ్నించారు. నియోజకవర్గ కేంద్రమైన మైదుకూరు ప్రభుత్వాసుపత్రిలో ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ గదులు ఏర్పాటు చేసి పరికరాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ప్రజాప్రతినిధులుగా పనిచేసిన సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని