logo

భువనేశ్వరికి జిల్లా నాయకుల పరామర్శ

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన పలువురు నాయకులు బుధవారం రాజమహేంద్రవరంలో పరామర్శించారు.

Published : 21 Sep 2023 05:11 IST

రాజమహేంద్రవరంలో సంతకం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కడప ఇన్‌ఛార్జి మాధవిరెడ్డి,
పక్కన పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

అరవిందనగర్‌(కడప), న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన పలువురు నాయకులు బుధవారం రాజమహేంద్రవరంలో పరామర్శించారు. తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన సతీమణి, కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాధవీరెడ్డి భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు అరెస్టు అన్యాయమని, ప్రజలంతా చంద్రబాబు వెంటే ఉన్నారని.. ధైర్యంగా ఉండాలని కోరారు. అనంతరం లోకేశ్‌ శిబిరం వద్ద చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ సంతకాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని