అరాచక పాలన అంతమయ్యే వరకు పోరాటం
రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న సైకో పోవాలి... సైకిల్ రావాలని, మేము సైతం బాబుతోనే ఉన్నామని తెదేపా రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధులు సురేంద్ర యాదవ్, త్యాగరాజు పేర్కొన్నారు.
బి.కొత్తకోటలో పోస్టుకార్డు చూపుతున్న తెదేపా నాయకులు
మదనపల్లె గ్రామీణ: రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న సైకో పోవాలి... సైకిల్ రావాలని, మేము సైతం బాబుతోనే ఉన్నామని తెదేపా రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధులు సురేంద్ర యాదవ్, త్యాగరాజు పేర్కొన్నారు. పట్టణంలోని అన్నమయ్య కూడలిలో దొమ్మలపాటి రమేశ్ ఆదేశాల మేరకు దొమ్మలపాటి యశశ్విరాజ్, చరణ్‌తేజ్‌ల ఆధ్యక్షతన చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి ఏడం రోజుకు చేరింది. ఈ సందర్భంగా తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి 2 వేల పోస్‌కార్డులను సేకరించారు. బాబుతోనే మేము.. రాష్ట్రంలో తెదేపా పరిపాలన రావాలని కార్డులపై రాసి వీటిని రాజమండ్రి సెంట్రల్ జైలులోని చంద్రబాబు నాయుడు పేరున కార్డులను పంపుతున్నట్లు చెప్పారు. జిల్లా మైనార్టీ నాయకులు ఎస్‌ఎం రఫీ, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ భవాని ప్రసాద్, మాజీ కౌన్సిలర్ నీలకంఠ, వెంకట రమణ, ఎంవీ రమణ, కత్తి లక్ష్మన్న పాల్గొన్నారు.
బి.కొత్తకోట : మాజీ సీఎం చంద్రబాబుకు మద్దతుగా బి.కొత్తకోటలో తెదేపా నాయకులు బుధవారం నుంచి పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. చంద్రబాబుపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని, జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని కోరుతూ భారత రాష్ట్రపతి, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరిటెండెంట్లకు రెండు వేర్వేరు బృందాలుగా విడిపోయి కార్డులు రాసి పోస్టు చేశారు. వైకాపా నాయకులు ఓటమి భయంతో చంద్రబాబును జైలుకు పంపిన విషయాన్ని ప్రజలు గుర్తించారని, దీనికి తగిన మూల్యాన్ని అధికార పార్టీ చెల్లించుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. కనకంటి ప్రసాద్, డి.కుమార్, మస్తాన్, సురేంద్ర, రాజా, రంజిత్, నాగరాజు, ఆనంద్, కిట్టన్న, మస్తాన్‌రెడ్డి, మదార్‌వలీ, ప్రభాకర్, చంద్ర, రవికుమార్ పాల్గొన్నారు. ్య నీరుగట్టువారిపల్లె తెదేపా నాయకులు చౌడేశ్వరిదేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయం బయట 101 టెంకాయలు కొట్టి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు త్వరగా బయటకు రావాలని, కేసులు లేకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. నాయకులు నీలకంఠ, ఆంజనేయలు, బండినాగరాజ, మోడం సిద్దప్ప, భవానిప్రసాద్, త్యాగరాజ పాల్గొన్నారు.
మదనపల్లె అర్బన్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావాలని కోరుతూ జనసేన, తెదేపా నాయకులు సంయుక్తంగా స్థానిక ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం బాలూస్వామి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా కుమారుడు జునైద్ అక్బరీ, జనసేన నాయకులు గంగారపు రామదాసుచౌదరి, జంగాల శివరామ్ మాట్లాడుతూ... వైకాపా ప్రభుత్వం కక్ష పూరితమైన వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. తెదేపా నాయకులు రాటకొండ నవీన్, నాగూర్‌వలి, వేమయ్య, రెడ్డిబూ, నాగమణి, జనసేన నాయకులు జగదీష్, మోహన్ పాల్గొన్నారు.
ముదివేడు (కురబలకోట): తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు త్వరగా బెయిల్ రావాలని కోరుతూ ముదివేడులోని గౌస్‌పీరా దర్గాలో బుధవారం గ్రామానికి చెందిన పలువురు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గొప్ప విజనరీ కలిగిన నాయకుడైన నారా చంద్రబాబు నాయుడిపై జగన్ అక్రమంగా కేసులు పెట్టించడం తగదని పేర్కొన్నారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో మైనార్టీలు తగిన విధంగా బుద్ధి చెప్పి ఓడించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతంలో తెదేపా నేత చంద్రబాబు సీఎంగా ఉండగా, ముస్లింలకు ఎన్నో మంచి సంక్షేమ పథకాలు ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు. జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేంద్ర యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయూబ్, మైనార్టీ నాయకులు హరూన్‌వలి, షంషీర్, నజీబ్, బావాజాన్, సయ్యద్‌సాహెబ్, నజీర్ అహమ్మద్, అఫ్జల్, అహమద్, నవాజ్, మౌలా, బావాజాన్, శివ పాల్గొన్నారు.
ములకలచెరువు గ్రామీణ : తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పెరిగిన జన ఆదరణ చూసి అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం దారుణమని మండల తెదేపా నాయకులు నరసింహారెడ్డి, మౌలా, సుధాకర్‌నాయుడు అన్నారు. మండల తెదేపా కన్వీనర్ పాలగిరి సిద్ద ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని దేవుళచెరువు, పర్తికోట, బురకాయలకోట, చౌడసముద్రం గ్రామాల్లో తెదేపా నాయకులు దేవుళచెరువు సమీపంలోని శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో చంద్రబాబుకు త్వరగా బెయిల్ మంజూరు కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెదేపా నాయకులు జేసీబీ సుధాకర్ నాయుడు, శంకర నారాయణ, సుదర్శన్, సుధాకర్‌నాయుడు, శ్రీనివాసులు, జయరాం, ప్రతాప్, చంద్ర, నాగమల్లప్ప, రామాంజులు, శంకరప్ప పాల్గొన్నారు.
ముదివేడు గౌస్ పీర్ దర్గాలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు
ములకలచెరువులో ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొడుతూ...
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి మొక్కలు.. నిధులకు దిక్కులు!
[ 29-11-2023]
రాళ్ల నేలలో రతనాల పంటలు పండించాలి. మెట్ట భూముల్లో ఉద్యాన తోటల సాగుకు ఊతమివ్వాలి. సంప్రదాయ పైర్లతో నష్టపోయినా కర్షకులను పండ్ల తోటల వైపు నడిపించాలి. -
క్రీడల్లో మెరికలు... విజయ కిశోరాలు
[ 29-11-2023]
సాంకేతిక విద్యనభ్యసిస్తూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు జేఎన్టీయూ అనంతపురం తరపున సౌత్‌జోన్ స్థాయి పోటీలకు ఎంపికై క్రీడల్లో రాణిస్తున్నారు. -
పాలకుల పాపం... రైతులకు శాపం!
[ 29-11-2023]
గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా నిర్మించిన నర్రెడ్డి శివరామిరెడ్డి సర్వరాయసాగర్ జలాశయం నిర్వహణను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. -
పాఠాలు అర్థం కావడం లేదమ్మా...!
[ 29-11-2023]
అమ్మా.. పాఠాలు సరిగా అర్థం కావడం లేదు.. అందరి ముందు చాలా అవమానంగా ఉందని ఆ యువతి బాధపడుతుండేది. -
రక్తదాత... సేవా ప్రదాత
[ 29-11-2023]
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ, తన స్నేహితులతో చేయిస్తూ కమలాపురానికి చెందిన జూటూరు విజయ్‌కుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పెద్దదర్గాకు రేపు సీఎం జగన్ రాక
[ 29-11-2023]
కడప నగరంలో నిర్వహిస్తున్న పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో గురువారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. -
‘ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉంది’
[ 29-11-2023]
వైకాపా కార్యకర్త బెనర్జీపై హత్యాయత్నం కేసులో భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేశారని వారి కుటుంబసభ్యులు ఆరోపించారు. -
అరాచక పాలన అంతానికి ఐక్య పోరాటం
[ 29-11-2023]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను అంతం చేయడానికి ఎన్నికల యుద్ధంలో తెదేపా-జనసేన పార్టీలు ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని.. -
దారంతా మురుగు మడుగు... వారంతా ముందుకే అడుగు
[ 29-11-2023]
మురుగు మడుగులా తయారైన రహదారి పక్కనుంచే నడుచుకుంటూ వెళుతున్న వీరు రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు. -
డంపింగ్‌యార్డు కాదిది... సర్కారు బడి తీరిది!
[ 29-11-2023]
చిత్రంలో కనిపిస్తోంది డంపింగ్ యార్డు అనుకుంటే చెత్తలో కాలేసినట్లే. ప్రభుత్వ పాఠశాలలను మనబడి..నాడు-నేడు కింద రూ.కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్న పాలకుల మాటలకు ఇక్కడ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయనడానికి ఈ చిత్రమే నిదర్శనం. -
నలుగురు ఎర్రచందనం దొంగల అరెస్టు
[ 29-11-2023]
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఒంటిమిట్ట సీఐ పురుషోత్తమరాజు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. -
ఎన్నికలకు సమాయత్తం!
[ 29-11-2023]
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రత్యేకంగా దృష్టి సారించి సన్నాహాలు చేస్తోంది. -
ఆగండి... వెళ్లిపోవద్దు
[ 29-11-2023]
కడప నగరానికి అత్యంత సమీపంలోని నియోజకవర్గంలోని అధికార. వైకాపాకు చెందిన ఓ కౌన్సిలర్ తెదేపాలోకి చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కౌన్సిలర్ స్థాయి వ్యక్తి పార్టీ మారితే నష్టంగా ఉంటుందని భావించిన కీలక నేత వెంటనే అప్రమత్తమయ్యారు. -
భార్యను వేధించిన భర్త హతం
[ 29-11-2023]
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని వేధించిన భర్తను కొడవలితో నరికి చంపిన సంఘటన సోమవారం రాత్రి కడప నగర శివారు సీకేదిన్నె మండలం సోమయాజులపల్లెలో చోటు చేసుకుంది. -
పోలీసుల అదుపులో దాడి ఘటన నిందితులు?
[ 29-11-2023]


తాజా వార్తలు (Latest News)
-
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
-
IND Vs AUS: మ్యాచ్‌లో ఓ మలుపు.. ఇషాన్ కిషన్ తప్పిదమే ఆసీస్‌కు కలిసొచ్చింది!
-
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
-
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య
-
ఇంటర్ విద్యార్థుల ఘర్షణ.. శిరోముండనం చేయించిన కళాశాల యాజమాన్యం!
-
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు