logo

యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రోత్సాహకాలు అందిస్తామని కలెక్టరు విజయరామరాజు తెలిపారు.

Published : 27 Sep 2023 04:06 IST

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రోత్సాహకాలు అందిస్తామని కలెక్టరు విజయరామరాజు తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి దిగుతున్న వారికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. జిల్లా స్థాయి నుంచి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ జయలక్ష్మి, అధికారులు కృష్ణమూర్తి, దుర్గాప్రసాద్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని