logo

ఆడపిల్లల శాతం తగ్గుదలపై సమీక్ష

జిల్లాలోని కొన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పట్టణ ఆరోగ్యకేంద్రాల పరిధిలో ఆడపిల్లల శాతం క్రమంగా తగ్గుతోందని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఉమామహేశ్వర కుమార్‌ పేర్కొన్నారు.

Published : 27 Sep 2023 04:06 IST

కడప వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలోని కొన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పట్టణ ఆరోగ్యకేంద్రాల పరిధిలో ఆడపిల్లల శాతం క్రమంగా తగ్గుతోందని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఉమామహేశ్వర కుమార్‌ పేర్కొన్నారు. తన కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్షలో పిండ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఆడశిశువు అని గుర్తిస్తే గర్భస్రావాలకు పాల్పడుతున్నారా అనే అంశంపై చర్చించారు. బాల్య వివాహాలు చేయడం కూడా దీనికి ఒక కారణమని చెప్పారు. ప్రతి ఆరోగ్యకేంద్రం పరిధిలో పనిచేసే సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. గర్భిణుల ఆరోగ్యపర్యవేక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ ఎస్‌ఓ రమేశ్‌రెడ్డి,  రమణమ్మ, అరుణకుమారి, వైద్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని