logo

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కోఆప్షన్‌ పదవికి రాజీనామా

తెదేపా అధినేత చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేయడాన్ని భరించలేక వైకాపా నాయకుడు, కోఆప్షన్‌ సభ్యుడు పొడదుర్తి కరీముల్లా (రెడ్డికరీం) తన పదవికి రాజీనామా చేశారు.

Published : 27 Sep 2023 04:06 IST

కమలాపురం, న్యూస్‌టుడే : తెదేపా అధినేత చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేయడాన్ని భరించలేక వైకాపా నాయకుడు, కోఆప్షన్‌ సభ్యుడు పొడదుర్తి కరీముల్లా (రెడ్డికరీం) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్‌ రాజశేఖర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమలాపురాన్ని నగర పంచాయతీగా చేసినప్పటి నుంచి ఎలాంటి అబివృద్ధి జరగలేదన్నారు. ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం వింతపోకడలు అవలంభిస్తూ తెదేపా అధినేతను అక్రమంగా అరెస్టు చేసిందని, దీన్ని నిరసిస్తూ జిల్లా మైనారిటీ కార్యదర్శి పదవితో పాటు కోఆప్షన్‌ పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని