logo

‘రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం’

జిల్లా కలెక్టర్‌ సంతకాలనే ఫోర్జరీ చేసిన పులివెందుల రియల్టర్లు వైకాపా వారే... అనే ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ డిమాండు చేశారు.

Published : 27 Sep 2023 04:06 IST

మారుతీనగర్‌, న్యూస్‌టుడే: జిల్లా కలెక్టర్‌ సంతకాలనే ఫోర్జరీ చేసిన పులివెందుల రియల్టర్లు వైకాపా వారే... అనే ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ డిమాండు చేశారు. స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం వామపక్షాల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా జీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ సాధన కోసం చేపట్టిన శాంతియుత చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి గృహనిర్బంధం, కార్యాలయాల ముందు పోలీసులు మోహరించడం లాంటి ప్రభుత్వ చర్యలు... పౌరహక్కులను కాలరాసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపించారు. ఈ నెల 27న నిర్వహించే చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని