logo

రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా

జిల్లాలో వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న రౌడీషీటర్లకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ అధికారులను ఆదేశించారు. 

Published : 27 Sep 2023 04:06 IST

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలో వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న రౌడీషీటర్లకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నేరాలపై సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని,  వారిని కట్టడి చేస్తే అక్రమ కార్యకలాపాలకు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. జిల్లాలో చోరీలు జరగకుండా రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేయాలని సూచించారు. ఏఎస్పీలు తుషార్‌ డూడి, ప్రేరణాకుమార్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ కృష్ణారావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని