శిలాసంపద శిథిలం!
ఏనుగు ఆకారంలో కనిపించే వినాయకుడు... జడలా అల్లుకున్న జుట్టుతో హనుమంతుని విగ్రహం... తలపై నుంచి కాకుండా పక్క నుంచి పారుతున్న గంగతో శివుని విగ్రహం లాంటి అరుదైన కళా కృతులు...రాతి శిల్పాలు... కాంస్య చిహ్నాలు...మట్టితో చేసిన బొమ్మలు...
అభివృద్ధికి దూరంగా మహావీర్ మ్యూజియం
న్యూస్‌టుడే, ఎన్‌జీవో కాలనీ (కడప)
శిథిలావస్థకు చేరిన మహావీర్ మ్యూజియం
ఏనుగు ఆకారంలో కనిపించే వినాయకుడు... జడలా అల్లుకున్న జుట్టుతో హనుమంతుని విగ్రహం... తలపై నుంచి కాకుండా పక్క నుంచి పారుతున్న గంగతో శివుని విగ్రహం లాంటి అరుదైన కళా కృతులు...రాతి శిల్పాలు... కాంస్య చిహ్నాలు...మట్టితో చేసిన బొమ్మలు... శాసనాల రాళ్లు ఇలా ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు కేంద్రం వైయస్‌ఆర్ జిల్లా కేంద్రమైన కడప నగరంలోని భగవాన్ మహావీర్ మ్యూజియం. గతంలో జిల్లాకే తలమానికంగా నిలిచిన ఇది నేడు అధికారుల, పాలకుల నిర్లక్ష్యంతో శిథిలమవుతోంది.
1982లో జైన్ సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి మ్యూజియం నిర్మాణం ప్రారంభించారు. ఇక్కడ ప్రాచీన కళాకృతులతో పాటు జైనమతానికి సంబంధించిన పలు ఆనవాళ్లు, చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి. మొత్తం నాలుగు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మొదటి ప్రవేశ గ్యాలరీలో హిందూ దేవుళ్లు, దేవతలను సూచించే రాతి శిల్పాలు, మిగిలిన వాటిల్లో జైన తీర్థంకరులు, రాజుల కాలం నాటి కళాఖండాలు, పురాతన వస్తువులు, రాతి సామగ్రి, మెగాలిథిక్ కుండలు, ఆదిమానవుల భౌతిక సంస్కృతిని వివరించే వస్తువులు, నాణేలు, టెర్రకోట బొమ్మలు, పెయింటింగులు మొదలైన చారిత్రక సామగ్రిని భద్రపరిచారు. నాలుగో గ్యాలరీని అమరవీరుల స్మారక ఫలకాలకు కేటాయించారు. ఈ మ్యూజియంలో బుద్ధ పాదాలు, అన్నపూర్ణ, సూర్య, జైన తీర్థంకర శిల్పాలు కూడా ఉన్నాయి.
ఎన్నో శిలాశాసనాలు : భారత దేశంలో జైనమతం అభివృద్ధి చెందిన సమయంలో పట్టణాలుగా వర్ధిల్లిన నందలూరు, గుండ్లూరు, తిమ్మాయపాలెం, అత్తిరాల, మంటపంపల్లె ఇలా అనేక ప్రాంతాల నుంచి సేకరించిన వస్తువులను పదిలపరిచారు. ఇప్పటికీ పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడుతున్న అనేక కళాకృతులను మహావీర్ మ్యూజియంలో భద్రపరిచేందుకు తెస్తుంటారు.
నిర్లక్ష్యానికి నిదర్శనం
పెచ్చులూడిన మూడో గ్యాలరీ
ఇంతటి ఘన చరిత్ర గల మహవీర్ మ్యూజియం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. వర్షం కురిస్తే కొన్ని గ్యాలరీలు నీటితో దర్శనమిస్తాయి. మరి కొన్ని పడిపోయేలా ఉన్నాయి. పరిస్థితి దారుణంగా ఉన్నా అటు అధికారులు, ఇటు పాలకులు ఎవరూ ఇటువైపు చూడడం లేదు. జిల్లా వాసులకే కాకుండా, రాయలసీమ మొత్తానికి ఓ దర్శనీయ ప్రదేశంగా ఉండే దీనిని ప్రస్తుతం ఎక్కడ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితికి తెచ్చారు. చూడడానికి వెళ్లేవారికి ఆ వైపు మూడు, నాలుగు సార్లు తిరిగినా మ్యూజియం కనిపించదు. దీని లోపలకు వెళ్లడానికి వీలు లేకుండా కలెక్టర్ కార్యాలయంతో కలిపి ప్రహరీ నిర్మించారు. దీంతో కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచే వెళ్లాల్సి వస్తోంది. మ్యూజియానికి కనీసం గేటు కూడా నిర్మించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
పరిరక్షించాలి
ఇక్కడ ఉన్న పురాతన సంపద మన సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజేస్తాయి. అటువంటి మ్యూజియం దీనావస్థలో ఉండటం బాధాకరం. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపి, చరిత్రను పరిరక్షించాల్సిన అవసరముంది. అధికారులు దృష్టిసారించి, నిధులు సమకూర్చి అభివృద్ధికి కృషి చేయాలి.
డాక్టర్ గానుగపెంట హనుమంతరావు
మరుగన పడటం బాధాకరం
గతంలో మహావీర్ మ్యూజియంలో ఉన్న పురాతన సంపద చూడటానికి రాయలసీమ జిల్లాల నుంచి ఎంతోమంది వచ్చేవారు. ఇప్పుడు ఇలా శిథిలావస్థకు చేరుకోవడం బాధాకరం. మ్యూజియంలోకి వెళ్లేందుకు గేటు కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణం. అధికారులు ఇప్పటికైనా స్పందించి నూతన భవనం ఏర్పాటయ్యే వరకైనా కనీస వసతులు కల్పించాలి.
కొండూరు జనార్దనరాజు, కార్యదర్శి, రాయలసీమ పర్యాటక సంస్థ
మూడేళ్ల కిందç ప్రతిపాదనలు : ప్రస్తుతం మ్యూజియానికి నూతన భవనాలు అవసరం. మూడేళ్ల కిందటే రూ.10 కోట్లతో డీపీఆర్ తయారు చేసి మ్యూజియం గ్రాంట్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. నిధులు వస్తే నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.
శివకుమార్, ఏడీ, పురావస్తు శాఖ (చిత్తూరు, కడప)
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికార దర్పం!
[ 30-11-2023]
పీలేరు గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం వైకాపా కార్యకర్తల సమావేశం నిర్వహించడం విమర్శలకు దారితీసింది. తొలుత పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో సమావేశానికి ఏర్పాట్లు చేశామని, వర్షం కురవడంతో కార్యాలయంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని సర్పంచి జీనత్ షఫీ తెలిపారు -
దొంగ ఓట్ల లెక్క తేల్చండి
[ 30-11-2023]
ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారించి దొంగ ఓట్లను తొలగించాలని కలెక్టర్ గిరీషకు బుధవారం తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. -
ఎమ్మెల్యేx పురాధ్యక్షురాలు
[ 30-11-2023]
మదనపల్లె పురపాలక సంఘంలో అధికార వైకాపా నేతల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే నవాజ్‌బాషా, పురాధ్యక్షురాలు మనూజ మధ్య నెలకొన్న వివాదం తాజాగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వద్దకు చేరింది. -
తవ్వుతున్నదెవరో... తరలిస్తున్నదెవరో?
[ 30-11-2023]
నదుల్లో ఇసుక తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తవ్వుతున్నదెవరు, తరలిస్తున్నదెవరని ఎక్కడ ఎవరిని అడిగినా మాకు తెలియదనే సమాధానమే వస్తోంది. ఊరూపేరూ లేకుండానే అక్రమ రవాణా సాగుతుండడం గమనార్హం. -
బీటెక్ రవిపై ఎందుకంత కోపం?
[ 30-11-2023]
పులివెందుల.. ఇటీవల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు బీటెక్ రవి అరెస్టుతో జిల్లాలో చర్చకు దారితీసింది. ప్రముఖుల పర్యటన సమయంలో విమానాశ్రయం ముఖద్వారం వద్ద ప్రవేశాల విషయంలో వివాదాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. -
ముస్లింలను మోసం చేసిన సీఎం జగన్ : తెదేపా
[ 30-11-2023]
ముస్లిం మైనార్టీలను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మోసం చేస్తూనే ఉన్నారని, వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ సంక్షేమాన్ని విస్మరించారని తెదేపా నేతలు ఆరోపించారు. -
‘దాచుకోవడం, దోచుకోవడమే వైకాపా ధ్యేయం’
[ 30-11-2023]
అధికార వైకాపా నేతలు తమ ప్రయోజనాల కోసమే సర్వరాయసాగర్ నీటిని ఉపయోగించుకుంటున్నారే తప్ప ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించడం లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు -
కరవు కాటుతో కందిపోతున్న కర్షకులు
[ 30-11-2023]
కరవు కాటుతో జిల్లాలో సాగవుతున్న ఖరీఫ్ కంది పంట వాడుముఖం పట్టింది. పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో కంది సాధారణ విస్తీర్ణం 3,453 హెక్టార్లు కాగా, విపణిలో మంచి ధరలు ఉండడంతో అధికంగా 5,117 హెక్టార్లలో సాగు చేశారు -
వైకాపా పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం
[ 30-11-2023]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబరు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపు మునిరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య దుయ్యబట్టారు -
ఆహ్లాద తీరం... అభివృద్ధికి దూరం
[ 30-11-2023]
అక్కడ ఎటుచూసినా చూడముచ్చటేసే ఆహ్లాదకర వాతావరణం. కనుచూపుమేర జల సోయగం. ఎత్తయిన గిరులు.. పచ్చని చెట్లు రా రమ్మంటూ స్వాగతం పలుకుతాయి. అరుదైన పక్షిజాతులు, వన్యప్రాణులు సందడి చేస్తాయి -
జాతీయ స్థాయి పురస్కారానికి మొర్రాయిపల్లె పాఠశాల ఎంపిక
[ 30-11-2023]
విద్యా అమృత్ మహోత్సవ్ 2022-23లో భాగంగా వినూత్న బోధనలు చేపట్టిన ప్రాజెక్టుల్లో చాపాడు మండలం మొర్రాయిపల్లె ప్రాథమిక పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది.