logo

‘విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం’

విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గండి సునీల్‌కుమార్‌, సగిలి రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు.

Published : 27 Sep 2023 04:32 IST

కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు

కడప, చిన్నచౌకు, అరవింద్‌నగర్‌, న్యూస్‌టుడే :  విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గండి సునీల్‌కుమార్‌, సగిలి రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి సమస్యల పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం చేపట్టిన చలో కలెక్టరేట్‌ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ముందుగా కోటిరెడ్డి కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో విద్యార్థి సంఘం నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. పోలీసులతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే సహించేది లేదన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూటకో జీవో తీసుకొచ్చి విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళనలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శులు రాహుల్‌, వీరపోగు రవి, జిల్లా కమిటీ సభ్యులు సురేష్‌నాయక్‌, మనోజ్‌, అజయ్‌, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని