logo

ఆలయాల్లో బాల్యవివాహాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

ఆలయాల్లో బాల్యవివాహాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ శంకర్‌ బాలాజీ హెచ్చరించారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం జిల్లా అర్చక సమాఖ్య కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

Published : 27 Sep 2023 04:32 IST

మాట్లాడుతున్న దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ శంకర్‌ బాలాజీ

మారుతీనగర్‌, న్యూస్‌టుడే: ఆలయాల్లో బాల్యవివాహాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ శంకర్‌ బాలాజీ హెచ్చరించారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం జిల్లా అర్చక సమాఖ్య కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల్యవివాహాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాయని తెలిపారు. ఆలయాల్లో ఎక్కువగా వివాహాలు జరుగుతాయని, నిబంధనల ప్రకారం వరుడు, వధువు ఆధార్‌, ఇతర రికార్డుల్లో వయస్సును పరిగణనలోకి తీసుకుని, అర్హత ఉంటే ఇద్దరి తల్లిదండ్రులు, బంధువుల ప్రమేయంతో వారి సమక్షంలోనే వివాహం జరిపించాలని తెలిపారు. ప్రేమ వివాహాలను చేయకూడదన్నారు. నిబంధనలను పాటించకుండా పెళ్లిళ్లు చేస్తే ఆలయ అధికారులు, సిబ్బంది, వివాహంలో పాల్గొన్న బంధువులు, అర్చకులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి రెండేళ్లు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారని వెల్లడించారు.  జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు విజయ్‌బట్టార్‌, సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు