logo

కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు

దేశంలో కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు వీస్తున్నాయని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జంగా గౌతమ్‌ పేర్కొన్నారు.

Published : 27 Sep 2023 04:32 IST

మాట్లాడుతున్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జంగా గౌతమ్‌, పక్కన తులసిరెడ్డి, తదితరులు

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: దేశంలో కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు వీస్తున్నాయని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జంగా గౌతమ్‌ పేర్కొన్నారు. జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కన్వీనర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపాను ఓడించడమే తమ పార్టీ ప్రధాన ధ్యేయమన్నారు.  ఏపీలోనూ తమ పార్టీ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని చెప్పారు.  ఇసుక, మైనింగ్‌, లిక్కర్‌, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని ఆరోపించారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్‌ బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లతో సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో పీసీసీ మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి, నగర అధ్యక్షుడు విష్ణుప్రీతంరెడ్డి, నాయకులు జకరయ్య, నజీర్‌అహ్మద్‌, శ్రీనివాసరెడ్డి, పార్థసారథిరెడ్డి, నియోవజకర్గ కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని