logo

Hyderabad News: తెగిపడిన అరచేయి.. అతికించిన వైద్యులు

యంత్రంలో ఇరుక్కుపోయి పూర్తిగా తెగిపడిన అరచేతిని మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా తిరిగి అతికించారు. వివరాలను ఆసుపత్రికి చెందిన ఆర్థొపెడిక్‌, ట్రామా సర్జన్‌ డాక్టర్‌ సునీల్‌ సోమవారం మీడియాకు తెలిపారు.

Updated : 14 Jun 2022 08:44 IST


వైద్యుడు సునీల్‌తో కేతారం

ఈనాడు, హైదరాబాద్‌: యంత్రంలో ఇరుక్కుపోయి పూర్తిగా తెగిపడిన అరచేతిని మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా తిరిగి అతికించారు. వివరాలను ఆసుపత్రికి చెందిన ఆర్థొపెడిక్‌, ట్రామా సర్జన్‌ డాక్టర్‌ సునీల్‌ సోమవారం మీడియాకు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన కేతారం (18) స్థానికంగా ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఈ నెల 4న ప్రమాదవశాత్తు యంత్రంలో ఎడమ చేయి ఇరుక్కుని చీలమండ వరకు తెగి కింద పడింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి పూర్తిగా తెగిపోయిన నరాల వ్యవస్థను గ్రాఫ్టింగ్‌ ద్వారా అతికించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని