logo

Adilabad: ప్రమాణాలు పాటించని డోవ్ కేంద్రం

జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోని టీచర్స్‌ కాలనీలో డోవ్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న మద్యం, మాదక ద్రవ్యాల పునరావాస (డీ-అడిక్షన్‌) కేంద్రం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తేలింది.

Published : 21 Jun 2024 17:51 IST

ఎదులాపురం: జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోని టీచర్స్‌ కాలనీలో డోవ్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న మద్యం, మాదక ద్రవ్యాల పునరావాస (డీ-అడిక్షన్‌) కేంద్రం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తేలింది.  ఈ కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి రాజర్ష్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి బాధితుల వివరాలు అసంపూర్తిగా ఉండడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  కేంద్రాన్ని తనిఖీ చేయాలని జిల్లా అంటు వ్యాధుల నివారణ అధికారి మిట్‌పల్లివార్‌ శ్రీధర్‌ను ఆదేశించడంతో ఆయన శుక్రవారం కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. రికార్డుల నిర్వహణ సరిగా లేదని, వాటిని ఎప్పటికప్పుడు నిర్వహించకుండా వీలున్నప్పుడల్లా రికార్డులు రాస్తున్నట్లు గుర్తించామన్నారు.  కేంద్రం నిర్వహిస్తున్న ప్రాంతం ప్రమాణాల మేరకు లేదని పేర్కొంటున్నారు.  నిర్ణీత ఫారాల్లో బాధితుల వివరాలు నమోదు చేయడం లేదని తేలింది.  కేంద్రంలో ఆశించిన స్థాయిలో పారిశుధ్యం లోపించిందన్నారు.  కేంద్రం నిర్వహణపై జిల్లా పాలనాధికారికి నివేదిక అందజేస్తానని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని